పేజీలు

21, జులై 2011, గురువారం

inscript గొప్పదా లేక apple key board గొప్పదా?

నా వరకు అయితే మొదట ఇన్స్క్రిప్టు ను typing tutor సహాయంతో నేర్చుకున్నాను. cdac వారు free గా అందించిన inscript typing tutor నేను నేర్చుకోవడానికి చక్కగా ఉపయోగపడింది. కేవలం 2 రోజుల్లోనే చాలా speed వచ్చింది.
కానీ కొన్ని సమస్యలు వచ్చాయి
1. యి అనే అక్షరం ఎలా రాయాలో తెలుసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. ఆ తరువాత య కు గుడి ఇస్తే యి వస్తుందన్న విషయం తెలుసుకున్నాను.(ఎంతైనా B.Sc చదువుతున్నాను కదా ఒకటో class లో చదివినియ్యి ఎం గుర్తు వుంటాయి )
2. ఇంకో సమస్య ఎదురైంది. ఫైర్ఫాక్స్ అనే వస్తుంది కానీ ఫైర్‌ఫాక్స్ అని రావడం లేదు ఈ సమస్య నాకు చాలా రోజులు వేదించినది. పై లాగానే ఈ సమస్య కు ఎన్ని రోజులయినా పరిష్కారం దొరకలేదు. నాకు పెర్ఫెక్ట్ గా నేర్చుకోకపోతే తిక్కరేగి పూర్తిగా వొదిలేసినా వోదిలేస్తా. ఆ విధంగానే కస్టపడి నేర్చుకొన్న inscript ను వాడడం వోదిలేసాను. అయితే వాటి పదులు లేఖిని,try చేశాను.ప్రతిసారి కాపీ పేస్టు చేయడం నాకు నచ్చలేదు. బరహ,అక్షరమాల,లాంటివి కూడా try చేశాను ఎందుకో నాకు అవన్ని అంతగా నచ్చలేదు ప్రముక కీ పాడ్ ను మాత్రం చాలా రోజులు వాడాను. ఎందుకంటే నేను ఏం టైపు చేసినా ఒక అక్షరం టైపు చేసినా అది తెలుగు లోనే చూపిస్తుంది.కాబట్టే అది వాడాను. ఆ తరువాత గూగుల్ input method ను తెలుసుకుని దానిని ఒక సరి ట్రై చేశాను. చలా బాగుంది. ఆ తరువాత దానినే వాడుతూ వొచ్చాను. అయితే inscript కు zero width joiner వుండవచ్చు, అనే సదుదేస్యంతో net లో చూస్తూ వుండేవాడిని.చాలా చోట్ల దీనికి పరిష్కారం ఇవ్వకపోగా దానిని జీరోవిడ్త్ లేకుండానే వాడమనే సలహాలు చూసాను. ఇక ఇది వుండదనే బావించి తెలుగు వికి లో ఇన్స్క్రిప్ట్ వ్యాసంలో ఈ లోపాన్ని రాసాను. అక్కడ నేను రాసిన వ్యాక్యం డిలీట్ చేయడం నాకు కోపాన్ని తెప్పించింది. నేను వివరణ కోరగా దీనిలో ఈ లోపం లేదని ctrl+shift+2 బటన్లు నొక్కితే zero width వస్తుందని వ్యాక్యాన్ని చేర్చారు. నేను మల్లీ సందేహంలో పడ్డాను. దేనిని వాడలో అర్ధం కాలేదు.
3. ఇంతలోనే నాకు ఆపిల్ keyboard గురించి తెలిసింది. బయట ఎవరు వాడినా DTP రంగంలో రారాజు ఆపిల్ అనే తెలిసింది.కానీ ఇంటర్నెట్లో అది కుదరదు.సరే inscript నే DTP లో వాడదాం అంటే pagemaker, photoshop లో unicode support లేదు. పైగా ఆపిల్ నేర్చుకొంటే అది resume లో extra qualification తప్పక అవుతుంది. రెండు నేర్చుకోవడం కంటే ఒక దాన్నే standard చేసుకోవడం మంచిది.పోనీ వీవెన్ తాయారు చేసిన ఆపిల్ ను వాడదాం అంటే anu script manager దానికి, వీవెన్ దానికి కొన్ని తేడాలు వున్నాయి. మళ్ళీ కధ మొదటికి వచ్చింది.
4.ఇంతలోనే ubumtu కొత్త virsion 10.04 వచ్చింది. నేను అప్పటికి 9.04 వాడుతున్నాను. అందులో వున్నా చాలా లాభాల్లో language bar కూడా ఒకటి. అందులో అన్ని భాషల్లో keyboard layouts వున్నాయి. మన తెలుగులో అయితే 5 రకాల keyboard layouts వున్నాయి.apple,inscript, potana, rts,ఇవ్వన్ని వున్నాయి. linux తో అయితే నా system వేగంగా run అవుతుంది.అందుకే నెట్ ను linux లో నే వాడతాను. ఇప్పుడు నాకు సరైన solution దొరికింది. anu fonts ద్వారా xpలో ఆపిల్ వాడతాను.అదే ఆపిల్ తో linuxలో నెట్ వాడతాను. అయితే xpలో వున్నప్పుడు నెట్ వాడవలసి వస్తే గూగుల్ input method ను use చేస్తున్నాను.already apple keyboard మాత్రమే వచ్చిన వారికీ ఇది శుభవార్తే. అయితే linux లో zero width రావాలంటే alt+b నొక్కాలి
చివరగా నేను చెప్పేదేమిటంటే తెలుగు వారికీ ఒక standard అనేది లేదు.లేఖిని లో టైపు చేస్తే వచ్చే పదాలకి prmuka type pad లో టైపు చేస్తే వచ్చే పదాలకి తేడా వుంటుంది.అలాగే విండోస్ లో వుండే ఇన్స్క్రిప్ట్ కి లినక్సు లో వుండే ఇన్స్క్రిప్ట్ కి తేడాలున్నాయి. ఎవరికీ ఇష్టమొచ్చిన key combination ని వారు వాడుకుంటున్నారు. బయట వుద్యోగం దొరకాలంటే apple keyboard వచ్చా? అని అడుగు తారు.నెట్ లో తెలుగు వారు ఇన్స్క్రప్ట్ కి ప్రచారం చేయడం నాకు హాస్యాస్పదంగా వుంది.microsoft language creation ద్వారా వీవెన్ గారు ఆపిల్ ను డెవలప్ చేయడం స్టాండర్డ్స్ కి మొదటి మెట్టు. నిజానికి inscript లో లోపాలు చాలా స్పష్టంగా కనపడతాయి.
1. రివర్సులో టైపు చేయడం-
మనం పుస్తకంలో రాసే తెలుగు భాషకు ఇక్కడ రివర్సులో టైపు చేయాలి. (మార్గాలు అని రాయాలంటే మా తరువాత
"ర + గ వత్తు +దీర్గం") మమూలుగా అయితే
"ర + దీర్గం+ గ వత్తు" అంటే ముందు ఈ రివర్సు కు అలవాటు పడాలి.(వీవెన్ గారి ఆపిల్ లో కూడా ఇదే ఇబ్బంది.)
2. alt+shift ఎప్పుడు english నుంచి telugu కు మారలన్నా ఈ keys నొక్కడం చాలా ఇబ్బంది. linux లో ctrl+space ఇచ్చి ఈ ఇబ్బంది కుంచెం తగ్గించారు.(అయితే ఇది విండోస్ లో వున్న problam)

ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం కేవలం తెలుగు అని కాకుండా అన్ని భారతీయ భాషలకూ ఒకే keyboard layout వుండాలని ఇన్స్క్రిప్ట్ తాయారు చేసారు. ఆ తరువాత దానికి ఒక్క updation కూడా లేదు. వీటి కంటే ఆపిల్ ని unicode కి తగ్గట్టు ఎవరైనా డెవలప్ చేస్తే చాలా బాగుంటుందని,నా అబిప్రాయం. 

4 కామెంట్‌లు:

  1. good analysis.
    However, you need to realize one thing.
    Professional users will always be different from casual users.
    And the casual users are in much larger numbers. So, popular features and methods are geared towards their use - the main feature should be low learning curve and extreme ease of use - Professional users will anyway a put in a little extra effort to learn something that will help them in their career.

    రిప్లయితొలగించండి
  2. ఆపిల్ నేర్చుకోవడం చాలా కష్టం ........
    సాధారణ యుసర్ల కోసం యునికోడ్ ని ఇంకా మెరుగుపరిస్తే బాగుంటుంది.
    ఫోటోషాప్ లో యునికోడ్ సపోర్ట్ ఉంటె బాగుండు..........

    రిప్లయితొలగించండి

విశేషాలు

ముచ్చట్లు

సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు

ప్రకటనలు