పేజీలు

28, ఫిబ్రవరి 2023, మంగళవారం

support from income tax

ఒక సమస్య ఈ రోజే అడిగాను i will post updates
to
Efilingwebmanager@incometax.gov.in
problem is
 i am getting mails from my credit card banks as i need to link aadhar and pan

i checked once i came to know it was not linked and asking 1000 rupees fine

but the fact is i already linked on 31 jan 2022 on
 eportal.incometax.gov.in 
this website got message
*******************
 Your PAN <DUxxxxxxxx9P> is linked to Aadhaar number <xxxx xxxx 9658>
*******************
and after that i checked many times and confirmed it was linked

now the things were changed.... 
the conclusion is i have no mistake from my side and you again asking to link pan aadhar and fined 1000 

my question is if i pay 1000 and link them will you again ask me link again or not.... 

k. karthik

thanking you sir


good morning stock market

SGX నిఫ్టీ 17,489.50 (+0.01%)

S&P 500 → +0.31%

నాస్డాక్ +0.63%

Nikkei → +0.43%

డాలర్ సూచిక 104.74 (+0.10%)

USDINR రెఫ్. రేటు→ 82.91


నెలవారీ FinNifty గడువు ముగిసింది! మీరు వ్యాపారం చేయడానికి ముందు కీలక సమాచారాన్ని తనిఖీ చేయండి

SGX నిఫ్టీ మిశ్రమ ప్రపంచ సూచనల మధ్య D- St కోసం జాగ్రత్తగా ప్రారంభాన్ని సూచిస్తుంది; INR దృష్టిలో ఉంది. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

1. SGX నిఫ్టీ - 17492

(0.02%)

2. నిఫ్టీ R&S 17500 | 17300 3. ఫిన్‌నిఫ్టీ మునుపటి. దగ్గరగా - 18001

4. ఫిన్‌నిఫ్టీ R&S - 18100 | 17900

5. వాచ్‌లిస్ట్ టెక్ M, Zee Ent, VI, Airtel

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

ఆ మొదటివాడు

ఒకానొక రాజ్యంలో, రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు.



రాజు:

 " మన రాజ్యంలో
మహా తెలివైనవారు వున్నట్లే, 
మహా తెలివితక్కువ వాళ్లూ వుంటారు కదా ?"

మంత్రి (సంశయిస్తూనే):

"అవును వుంటారు ప్రభూ!"

రాజు:

 " ఐతే, మన రాజ్యం అంతా గాలించి, అందరిలోకి అతి  తెలివితక్కువ వాళ్లను ఐదుగురిని వెదికి పట్టుకొని, ఇక్కడ సభలో హాజరు పరచండి" అని ఆదేశించాడు.

మంత్రి:

"చిత్తం ప్రభూ" అని సభనుండి నిష్క్రమించాడే కానీ మనసంతా ఎలా అన్న ఆలోచనలతోనే మస్తిష్కమంతా నిండిపోయింది.

ఎవడికైనా కొన్ని పరీక్షలు పెట్టో, ప్రశ్నలు అడిగో
వాడు తెలివయిన వాడో, కాదో తెలుసుకోవచ్చు.
మరి, తెలివితక్కువ వాడినెలా గుర్తించాలి?
ఈ సందిగ్దావస్త నుండి బయటపడటమెలాగో అర్ధం కావటంలేదు మంత్రిగారికి. ఒప్పుకున్నాక తప్పదుగా! రాజాజ్ఞమరి.

ఒక నెల రోజులపాటు రాజ్యమంతా తిరిగి ఇద్దరిని పట్టుకుని సభలో హాజరు పరిచాడు.

రాజు:

 " మహామంత్రీ! మీరు పొరబడినట్లున్నారా లేక లెక్క తప్పారా?
మేము ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాము. కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకొనివచ్చారు"?

మంత్రి:

 " మహా ప్రభూ! తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి"

రాజు:

" సరే! సెలవియ్యండి"

మంత్రి:

" నేను రాజ్యమంతా తిరిగాడుచుండగా...
 ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్దమూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు. అలా ఎందుకు అని అడుగగా, తలపైనున్న మూట, బండి మీద పెడితే ఎడ్లకు భారమవుతుంది అని సమాధానమిచ్చాడు. అందుకే అతనిని ఐదవ తెలివితక్కువ వాడిగా తీసుకొచ్చాను".

రాజు:

 " భేష్! తరువాత?"

మంత్రి:

" ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి, తన  గేదెను ఇంటి పైకప్పు మీదకు లాగుతూ కనిపించాడు.

" కావున ఇతన్ని నాల్గవ తెలివితక్కువ వాడిగా ప్రవేశపెట్టాను".

రాజు:

 " బహు బేషుగ్గా వుంది. తరువాత?"

మంత్రి :

" రాజ్యంలో చాలా సమస్యలుండగా,  వాటినన్నింటినీ ప్రక్కనపెట్టి,  తెలివితక్కువ వాళ్లను వెతకటంలో నెల రోజుల పాటు సమయం వృధాచేసాను.  కాబట్టి నేను మూడవ తెలివితక్కువ వాడిని."

రాజు ( గట్టిగా నవ్వుతూ ) " తరువాత ?

మంత్రి :

" పరిష్కరించాల్సిన సమస్యలుండగా, భాద్యతలన్నీ విస్మరించి, తెలివితక్కువ వాళ్ల కోసం వెదుకులాడుతున్న తమరు రెండో వారు".

అది విన్న సభలొని వారంతా నిశ్చేష్టులై భయభ్రాంతులై  చూస్తుండిపోయారు.
నిశ్శబ్దం ఆవరించింది సభలో.

రాజుగారు తేరుకుని కుతూహలం తో  " మంత్రి గారు సందేహం లేదు. మీరు సెలవిచ్చినదాంట్లో వాస్తవానికి దగ్గరగానూ నిశ్సందేహంగా నిజాయితో కూడిన నిజముంది.
మరి మీరు మెదటి తెలివితక్కువ వారెవరో  తెలియచెప్పండి"

మంత్రి:

చిత్తం మహా ప్రభో!
చెయ్యవలసిన పనులన్నీ మానేసి,
నెట్ ఆన్ చేసుకుని ఈ పోస్ట్ ని చదువుతున్నవాడే...
"ఆ మొదటివాడు."


తప్పక మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసి మీరు మొదటివాడు కాదనిపించుకోండి.

ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం

ఒక పల్లెలోని ఒక ఇంటికి చాలా రోజులు ప్రయాణం చేసి, అలసిపోయిన ముగ్గురు పెద్దవాళ్ళు వచ్చారు.

"లోపలికి రండి నా భర్త వచ్చిన వెంటనే భోజనం చేయవచ్చు మీరు" అంటూ పిలిచింది.

మగవాళ్ళు లేని ఇంట్లో మేం భోజనం చేయము.అతను తిరిగివచ్చిన తరువాతే లోపలికి వస్తాము అని బయట అరుగు మీద అలసట తీర్చుకుంటున్నారు.

భర్త పొలం పని ముగించుకొని సాయంత్రం ఇంటికి వస్తూనే బయట అరుగు మీద ఉన్న వారి వద్దకు వెళ్ళి"నా భర్త వచ్చాడు లోపలికి రావడానికి మీకు అభ్యంతరం లేదు కదా," అని అడిగింది." లేదు..... కాని మా ముగ్గురిలో ఒకడు మత్రమే మీ ఇంట్లోకి వస్తాడు అది మా నియమం" అన్నారు.

ఆ ఇల్లాలు ఆశ్చర్యంతో చూస్తుండగా పెద్దాయన" నా పేరు 'ప్రేమా, ఇతని పేరు 'గెలుపూ, ఈయన పేరు 'ఐశ్వర్యం'. మాలో ఒక్కరిని మాత్రమే ఆహ్వానించు అన్నాడు. వచ్చిన వారు మాములు మనుషులు కారు అని ప్రేమ, గెలుపు, ఐశ్వర్యం అనే రూపాల్లో ఉన్న దేవతలని తెలిసిపోయింది.

సంతోషంతో పొంగిపోతు అమె ఆ విషయాన్ని భర్తకు చెప్పింది. విన్న భర్త పరవశంతో "బ్రతుకులో గెలుపే ముఖ్యము కాబట్టి ఆయన్నే పిలుద్దాం అని" అన్నాడు.

దానికి ఆమె "గెలుపు ఒకటే ఏమి లాభం, ఐశ్వర్యం లేకపోయే కాబట్టి ఐశ్వర్య దేవతని ఆహ్వనిద్దాం" అని అంది.

వీరి ఇద్దరి మాటలు వింటున్న్న వారి కోడలు, గెలుపు ఐశ్వర్యం కంటే ప్రేమ అనేది భార్యా భర్తలు, పిల్లలు, అత్తా కోడళ్ళు కలిసి మెలసి ఉండగలం కాబట్టి ప్రేమ మూలాధారం సుఖజీవనానికి" అంటూ సలహ ఇచ్చింది.

వెంటనే ఆ ఇంటి యజమాని బయటకు వచ్చి మీలో ' ప్రేమ ' అనే వ్యక్తి లోపలికి రావచ్చు అన్నాడు. ప్రేమ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. ప్రేమ వెనకే గెలుపు, ఐశ్వర్యం కూడా అతనితో బాటు ఇంట్లోకి వచ్చాయి. ఇది చూసి ఆమెకు ఆశ్చర్యం కలిగింది.

ఆముగ్గురూ "మీరు గెలుపు లేదా ఐశ్వర్యం కోరి ఉంటే మేమిద్దరం ఉండి పోవాల్సివచ్చేది .ప్రేమను మీరు పిలవడం వలన మేమూ పిలవకుండానే వచ్చాము కారణం ప్రేమ వెన్నంటే గెలుపు, ఐశ్వర్యం అనేవి నడవాలి అని మా దేవుని ఆఙ్ఞ" అన్నారు......కాబట్టి ఎక్కడ ప్రేమ ఉంటె అక్కడ ఐశ్వర్యం, గెలుపు తప్పక ఉంటాయి ........ Life is Beautiful.. Celebrate Every Moment with Love and Compassion

మానవ శరీరం గురించి అద్దిరిపోయే విషయాలు:


* మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.

* మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.

* మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.

తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి

* ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.

* రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.

* లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.

* 90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.

* శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.

* మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.

* నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.

* మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.

* మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.

* గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.

* 7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.

* వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.

* ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.

* మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.

* మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.

* మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.

* మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.

* మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.

* చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.

* మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.

* మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.

* మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.

* మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.

* మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.

* మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.

* ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.

* మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.

Hemanth

అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:

 ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
తేట తేట తెనుగులా....
మన తెలుగు భాష గొప్పదనం ముందుగా అక్షరమాల అల్లికలోనే ఉంది.
పూర్వం గురువులు పిల్లలతో వర్ణమాలను వల్లె వేయించేవారు. అలా కంఠస్ధం చేయించడంవల్ల కంఠం నుంచి ముఖం వరకు వ్యాయామం తెలియకుండానే జరుగుతుంది
ఏలాఅంటే
=======
అ ఆ ఇ ఈ ఉ ఊ ఋ ౠ ఎ ఏ ఐ ఒ ఓ ఔ అం అ:
ఇలా అచ్చులను పలకడం వలన ముఖమంతా కదులుతూ వ్యాయామం జరుగుతుంది.
క ఖ గ ఘ ఙ……..కంఠ భాగం
చ ఛ జ ఝ ఞ……..కంఠంపైన నాలుక మొదటి భాగం
ట ఠ డ ఢ ణ……నాలుక మధ్యభాగం
త థ ద ధ న……నాలుక కొస భాగం
ప ఫ బ భ మ……..పెదవులకు
య ర ల వ శ ష స హ ళ క్ష ఱ……నోరంతా
ఇలా ముఖమంతా హల్లులతో వ్యాయామం జరుగుతుంది.
సుందర సుమధుర సౌమ్యమైన కమ్మని మృదుత్వంతో కూడిన తియ్యని తేనేలాంటిది మన భాష. ఆనందంగా మనసుకు హాయి గొలిపే విధంగా వినసొంపైన మాటలు మనందరి నోటంట వెలువడుతే ఎంత బాగుంటుంది.
తెలుగు భాషను అందంగా వ్రాసే వారికి చిత్రకళ సొంతమవుతుందంట ఎందుకంటే మన వర్ణమాలతో అన్ని మెలికలు ఉన్నాయి.
మనలోని భావాన్ని మాతృభాషలో వర్ణించినంత వివరంగా ఏ భాషలోను వ్రాయలేరు. తెలుగువారింటి ముంగిట ముగ్గును చూస్తే ఎంత ఆహ్లదభరితంగా చూడముచ్చటగా ఉంటుందో తెలుగువారి మనస్సు అంత అందంగా ఉంటుంది.
తెలుగులో మాట్లాడండి. .
తెలుగులో వ్రాయండి. . .
తెలుగు పుస్తకాలు చదవండి..చదివించండి..
తేనెలొలికే తెలుగు భాష తియ్యదనం ఆస్వాదించండి . . .
_____________________________________
ఈ పోస్ట్ నాది కాదు. రచయిత ఎవరో తెలియదు.వారికి నా ధన్యవాదాలు

18, ఫిబ్రవరి 2023, శనివారం

ఒక వ్యూహం నుండి మరొక వ్యూహం వైపు దూసుకుపోవడం...విఫలమవడానికి మరో కారణం

బ్రూస్ లీ ఒకసారి ఇలా అన్నాడు, "నేను 10,000 కిక్‌లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి భయపడను, కానీ ఒకే కిక్ ను 10,000 సార్లు ప్రాక్టీస్ చేసిన వ్యక్తికి భయపడతాను."ఈ ఉదాహరణలో, ఒక వ్యూహానికి కట్టుబడి, ఒక కిక్ చాలాసార్లు సాధన చేసిన వ్యక్తి. మరొకడు దాదాపు ప్రతి కిక్‌ని ప్రయత్నించాడు కానీ ఏదీ సాధించలేకపోయాడు. ఎప్పుడూ ఎలాంటి నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోకుండా ఉంటే కుదరదు...వ్యూహం నుండి వ్యూహానికి మారకుండా చూసుకోవాలి.

leverage ఎక్కువగా వాడితే వచ్చే ప్రమాదం

చాలా leverage ని ఉపయోగించడం డబ్బును కోల్పోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి గొప్ప మార్గం. గెలుపొందిన వ్యూహం తదుపరి ట్రేడ్‌లలో గణాంకపరంగా నష్ట పరంపరను ఎదుర్కొంటుంది కాబట్టి, పరిమాణాన్ని పెంచడం మరియు పరపతిని ఉపయోగించడం అనేది కొన్ని సవాల్లను కూడా ఎదుర్కుంటుంది... కఠినమైన పాచ్ తాకినప్పుడు, మీరు మీ మొత్తం మూలధనాన్ని కోల్పోవచ్చు. ఊహించిన దానికంటే మించి నష్టపోతారని ముందుగానే తెలుసుకోవాలి. ప్రపంచంలోని అత్యంత దూకుడుగా ఉండే హెడ్జ్ ఫండ్‌లు సాధారణంగా FX ట్రేడింగ్‌లో కూడా 5-8x పరపతి leverage ని ఎక్కువగా ఉపయోగించవు కాబట్టి, మీరు 10-20x పరపతిని ఉపయోగిస్తున్నారంటే మీ వ్యాపారం పూర్తిగా విఫలం అవుతుందనే అర్ధం.

15, ఫిబ్రవరి 2023, బుధవారం

మీరు వ్యాపారం/పెట్టుబడిపై *ఎక్కడ* తప్పు చేస్తున్నారో గుర్తించడం.

  • ఈ ధర హిట్ అయితే, నేను ట్రేడ్ నుండి నిష్క్రమిస్తున్నాను. తర్వాత ఏమి జరగబోతోందో నాకు తెలుసు అని అనుకోవద్ద
  • ఎక్కువ పొజిషన్స్ అంటే ట్రేడర్‌గా ఉన్నప్పుడు నేను ఈ స్థితిలో ఉన్నప్పుడు ఏ సమయంలోనైనా నా మూలధనంలో 10% (లేదా కొంత శాతం) కంటే ఎక్కువ కోల్పోకూడదనుకుంటున్నాను.
  • క్యాష్ మేనేజ్‌మెంట్/పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్...మీరు మీ మొత్తం మూలధనంలో ఎంత మొత్తాన్ని కోల్పోవాలనుకుంటున్నారు? ప్రతి వ్యాపారం మీ మూలధనంలో 50% రిస్క్ చేయాలా? 20%? 5%? 1%? అనేది ముందుగానే నిర్ధారించుకోవడం.....వారికి పొజిషన్ సైజింగ్, స్టాప్ లాస్‌లను సెట్ చేయడం లేదా అకౌంట్ స్టాప్ లాస్‌లను సెట్ చేయడం వంటి ప్రణాళికలు నిర్ధారించుకోవడం ముఖ్యం.
  •  ఎటువంటి స్థిరత్వాన్ని కలిగి ఉండని వారు కొన్ని పెద్ద నష్టాలను తీసుకుంటారు. సిద్ధాంతపరంగా, మార్కెట్ కేవలం సంభావ్యత probabilities యొక్క గేమ్. అది ఎప్పటికీ ఆట నుండి నాకౌట్ అవుతుంది.

14, ఫిబ్రవరి 2023, మంగళవారం

స్టాక్ మార్కెట్లు ఏ దిశలో కదులుతాయో ఎవరికీ తెలియదు.....

మార్కెట్ హెచ్చు తగ్గులను అంచనా వేయడానికి ప్రయత్నించడం వలన మీరు చాలా అనాలోచిత సమయాల్లో కొనుగోలు చేయడం లేదా విక్రయించడం జరుగుతుంది. కాబట్టి మార్కెట్లు అస్థిరంగా ఉన్నప్పుడు తీవ్ర భయాందోళన నిర్ణయాలను తీసుకోకుండా ఓపికగా విశ్లేషణ చేయడం ద్వారా దీర్ఘకాలికంగా మీ పెట్టుబడులకు సరైన విలువ చేకూరుతుంది.

10, ఫిబ్రవరి 2023, శుక్రవారం

మీ పోర్ట్‌ఫోలియో మరియు రీబ్యాలెన్స్‌ని సమీక్షించండి


మార్కెట్లు నిరంతరం మారుతూ ఉంటాయి మరియు మీ పెట్టుబడులు కూడా మారుతూ ఉంటాయి. మీరు చాలా సంవత్సరాలుగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, కాబట్టి రెగ్యులర్ చెక్‌లను నిర్వహించడం చాలా ముఖ్యం.రీబ్యాలెన్సింగ్ ప్రక్రియలో భాగంగా, మీరు కోరుకున్న ఆస్తి కేటాయింపుకు తిరిగి రావడానికి మీరు నిర్దిష్ట పెట్టుబడులను కొనుగోలు చేస్తారు లేదా విక్రయిస్తారు. ప్రమాదాన్ని తగ్గించడమే లక్ష్యం అయినప్పుడు పోర్ట్‌ఫోలియో చాలా దూకుడుగా ఉండకుండా నిరోధించడంలో ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు మీరు పొగాకు సంభందించిన కేటగిరి 25 % ఉంచుకొని బ్యాంకింగ్ కేటగిరి 25% ఉంచుకుని అలాగే బంగారం మరియు fmcg కేటగిరీలకు 25-25 % ఇచ్చారు అనుకుందాం ఇప్పుడు పొగాకు కేటగిరీలో itc కొనుండవచ్చు . ఈ 5 సంవత్సరాలలో itc లో fmcg ఉత్పత్తులు కూడా మెదలు పెట్టింది అంటే నీకు తెలియకుండానే fmcg 30% అలానే పొగాకు 20% గా మీ పోర్టిఫోలియో మారిపోయింది. కాబట్టి దీనికి సరిసమానమైన రీబ్యాలెన్సు చేయవచ్చు.

రీఇన్వెస్ట్‌మెంట్ లేదా cost averaging మొత్తం రాబడిని పెంచడంలో సహాయపడుతుంది..

మీ మొత్తం లాభాలను పెంచండి. సరళంగా చెప్పాలంటే, మీ ఆదాయాలు కూడా రాబడిని ఉత్పత్తి చేస్తాయి, దీనిని చక్రవడ్డీ అంటారు. అయితే, ఆదాయాన్ని నగదుగా స్వీకరించడం కంటే తిరిగి పెట్టుబడి పెట్టడం-మీరు స్వీకరించే ఏదైనా ఆదాయం స్వయంచాలకంగా తిరిగి పెట్టుబడి పెట్టబడితే - అది కూడా మీ ఆదాయాన్ని మరింత పెంచే అవకాశం ఉంది - దీనిని sip అని వ్యవరించవచ్చు. గుర్తుంచుకోండి పరిస్ధితి అనుకూలించకపోతే గణనీయంగా ఆదాయం తగ్గే అవకాశం కూడా అంతే ఉంటుంది.... మళ్లీ కలుద్దాం.

ఊహాజనిత పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి

ప్రేక్షకులను అనుసరించవద్దు మరియు ఇతర వ్యక్తులు చేస్తున్నందున పెట్టుబడి పెట్టకండి (లేదా విక్రయించకండి). ఫలానా రాజు అనే వ్యక్తి బిట్ కాయిన్ ని25 లక్షల దగ్గర కొన్నాడు రాజు కొన్నాడని ఆ కంపెనీలోనే పని చేసే సోము అనే వ్యక్తి 25 లక్షల దగ్గరే కొన్నాడు అయితే రాజు sudden గా వేరే ఊరికి transfer అయిపోయాడు కాబట్టి ఇద్దరి మద్య సంబందాలు లేకుండా పోయాయి ఈ మధ్యలో బిట్ కాయిన్ 40 లక్షల వరకు వెల్లింది అంతా బానే ఉంది అంతలోనే ఇండియా గవర్నమెంటు బిట్ కాయిన్ లో జరిగే transactions కు తరువాత సంవత్సరం నుండి 30% tds కట్ అవుతుందని update చేసారు.... రాజు వెంటనే ఈ update బిట్ కాయిన్ కు ఖచ్చితంగా నెగిటివ్ అని పరిగణించి 30 లక్షల దగ్గర అమ్మేశాడు, అయితే రాజుతో ఎలాంటి communication లేని సోము అలానే ఉంచుకున్నాడు ..... చివరకు బిట్ కాయిన్ కు క్రాష్ వచ్చి సోము చాలా నష్టపోయాడు ఇదంతా కేవలం కల్పిత కధ అయినప్పటికీ గ్రుడ్డిగా పెట్టుబడులు పెట్టే దాదాపు అందరి పరిస్ధితి ఇంతే ఉంది.

దీర్ఘకాలిక పెట్టుబడులు ఎల్లప్పుడూ అధిక రాబడితో కలిసి ఉండవు.

 

అన్నింటిలో మొదటిది, కంపెనీ లేదా ప్రాజెక్ట్ నుండి మనం ఏ లాభదాయకతను పొందాలనుకుంటున్నామో మనం అర్థం చేసుకోవడం అవసరం. డాక్యుమెంటేషన్ మరియు రోడ్‌మ్యాప్‌ను తెలుసుకోవడం అవసరం,వీటిని అర్దం చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టవచ్చు. అయితే, లాభం శాతం పరంగా వ్యక్తీకరించాలి. అన్నింటికంటే, ఆస్తుల విలువ దశాబ్దం క్రితం నాటి ధరల విలువలకు తిరిగి రావచ్చు లేదా అంతకంటే ఘోరంగా కంపెనీ మూసివేయబడచ్చు.

రాబడి ఎక్కువ దానర్థం రిస్క్ స్థాయి కూడా ఎక్కువ

 

అధిక రాబడి ఆకర్షణీయంగా ఉండవచ్చు, కానీ సాధారణంగా నిధులను కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. రిస్క్ పట్ల మీ విధానం గురించి జాగ్రత్తగా ఆలోచించండి. రాబడి తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తక్కువ ప్రమాదకర పెట్టుబడులను ఎంచుకోవడం మీకు మరింత సౌకర్యంగా ఉండవచ్చు. అయితే, రిస్క్ లేని పెట్టుబడి ఏదీ లేదని గుర్తుంచుకోండి మరియు మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే తక్కువ రాబడిని పొందే అవకాశం ఎల్లప్పుడూ ఉంటుంది. అయితే, మీ మొత్తం డిపాజిట్‌లో చాలా చిన్న భాగంతో పెట్టుబడి పెట్టండి.

మీ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో వేయకండి

 నేడు, ఈ నియమం గతంలో కంటే మరింత అవసరంగా ఉంది. "మీ గుడ్లన్నింటినీ ఒకే బుట్టలో పెట్టవద్దు" అనే సామెత మనందరికీ తెలుసు, అయితే పెట్టుబడి పెట్టేటప్పుడు ఈ నియమాన్ని వర్తింపజేయడం చాలా ముఖ్యం. విభిన్న ఆస్తి రకాలు మీ డబ్బును విస్తరించడం అంటే మీరు ఒకే రకమైన పెట్టుబడిపై ఎక్కువగా ఆధారపడరు. దీనర్థం ఏమిటంటే, వాటిలో ఒకటి పేలవంగా పనిచేసినట్లయితే, ఇతర పెట్టుబడులలో కొన్ని ఆ నష్టాలను పూరించవచ్చు, అయినప్పటికీ హామీలు లేవు.

9, ఫిబ్రవరి 2023, గురువారం

మీకు అర్థం కాని వాటిపై ఎప్పుడూ పెట్టుబడి పెట్టకండి

 ఏదైనా పెట్టుబడిలో పెట్టుబడి పెట్టడానికి ముందు, దాని గురించి పూర్తిగా పరిశోధించడానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా మీరు ఖచ్చితంగా స్పష్టమైన మరియు నష్టాలు ఎలా ఉంటాయో కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు, ఫండ్ యొక్క ప్రధాన విధులు మరియు రుసుములను వివరించే కీ ఇన్వెస్టర్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (KIID) లేదా కీ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ (KID)ని జారీ చేస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు మీరు దీన్ని చదవాలి. మీరు వ్యక్తిగత ప్రాజెక్ట్‌లలో పెట్టుబడి పెడితే, కంపెనీ ఏమి చేస్తుందో మరియు భవిష్యత్తులో ఎలా డబ్బు సంపాదించాలని ప్లాన్ చేస్తుందో మీకు ఒక అవగాహన ఉండి తీరాలి. పెట్టుబడి పెట్టడానికి ముందు, మీరు బిజినెస్ మరియు తాజా వార్తల గురించి తెలుసుకోవడం, వారి  సోషల్ నెట్‌వర్క్‌లకు సభ్యత్వాన్ని పొందడం లాంటివి చేయాలి.

మీ స్వంత పరిశోధన చేయండి, స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకోండి..

 ఇంటర్నెట్‌లో ఎవరైనా చెప్పేదాన్ని గుడ్డిగా విశ్వసించవద్దు,. సానుకూల మరియు ప్రతికూలతలను అర్థం చేసుకోవడానికి మరియు నిష్పాక్షికమైన అభిప్రాయాన్ని పెంపొందించడానికి మీ వంతు కృషి చేయండి. ....మీ ఆర్థిక లక్ష్యాలను మరియు మీరు పెట్టుబడి పెట్టే  సమయం కూడా  మీ వ్యూహానికి సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు మీ పిల్లల చదువుల కోసం డబ్బు ఆదా చేయడం లేదా దశాబ్దాల దూరంలో ఉన్న వ్యక్తిగత పదవీ విరమణ వంటి దీర్ఘకాలిక లక్ష్యాలను కలిగి ఉంటే, ఆ సమయానికి ముందు పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహాన్ని పునికి పుచ్చుకుని ఉండవచ్చు.

7, ఫిబ్రవరి 2023, మంగళవారం

పెట్టుబడి పెట్టే ముందు ఈ పద్దతులను పాటిద్దాం......

  • మనం పెట్టే పెట్టుబడులు అంత కష్టం కానే కాదు. పెట్టుబడిదారులు తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడే బంగారు సూత్రాలు ఉన్నాయి . 
  • డబ్బు నిర్వహణ విషయానికి వస్తే, సంపద సృష్టించడంలో పెట్టుబడులు కీలక పాత్ర పోషిస్తాయి. మొదట, మీరు ఏ ఉత్పత్తిని ఎంచుకోవాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి, ఎంత వరకు ఉంచుకోవాలి మొదలైనవాటిని నిర్ణయించడం కష్టం. 
  • కానీ మీరు కొనసాగిస్తున్నప్పుడు, మార్కెట్ ఎలా పనిచేస్తుందో మీకు బాగా అర్థం అవుతుంది. మీరు ఎంత క్రమశిక్షణతో ఉన్నా మరియు మీరు ఎలాంటి నియమాలను అనుసరించినా, పెట్టుబడి అనేది నష్టాలతో కూడుకున్నదని మరియు మీరు పెట్టిన దానికంటే తక్కువ పొందినా ఆశ్చర్యపోనక్కరలేదు…. గుర్తుంచుకోండి. 
  •  ప్రతి పెట్టుబడిదారుడు తెలుసుకోవలసిన కొన్ని నియమాలు రాబోయే పోస్టులలో పరిశీలిద్దాం :

5, ఫిబ్రవరి 2023, ఆదివారం

ITC లిమిటెడ్ మధ్యంతర డివిడెండ్‌ను ఆమోదించింది

 మార్చి 3, 2023 మరియు మార్చి 5, 2023 మధ్య చెల్లించాల్సిన ఆర్థిక సంవత్సరానికి మార్చి 31, 2023తో ముగిసే మధ్యంతర డివిడెండ్‌ను ITC లిమిటెడ్ ఆమోదించింది

3 ఫిబ్రవరి, 2023న జరిగిన సమావేశంలో కంపెనీ డైరెక్టర్ల బోర్డులో, మార్చి 31, 2023తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రతి INR 1 సాధారణ షేరుకు INR 6 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించినట్లు ITC లిమిటెడ్ ప్రకటించింది; అటువంటి డివిడెండ్‌కు అర్హులైన సభ్యులకు మార్చి 3, 2023 మరియు మార్చి 5, 2023 మధ్య చెల్లించబడుతుంది. మధ్యంతర డివిడెండ్ కోసం సభ్యుల అర్హతను నిర్ణయించే ఉద్దేశ్యంతో కంపెనీ shares ఫిబ్రవరి 15, 2023 లోపు మీ demat account లో ఉండాలి అంటే రికార్డ్ డేట్‌గా నిర్ణయించింది.