ప్రేక్షకులను అనుసరించవద్దు మరియు ఇతర వ్యక్తులు చేస్తున్నందున పెట్టుబడి పెట్టకండి (లేదా విక్రయించకండి). ఫలానా రాజు అనే వ్యక్తి బిట్ కాయిన్ ని25 లక్షల దగ్గర కొన్నాడు రాజు కొన్నాడని ఆ కంపెనీలోనే పని చేసే సోము అనే వ్యక్తి 25 లక్షల దగ్గరే కొన్నాడు అయితే రాజు sudden గా వేరే ఊరికి transfer అయిపోయాడు కాబట్టి ఇద్దరి మద్య సంబందాలు లేకుండా పోయాయి ఈ మధ్యలో బిట్ కాయిన్ 40 లక్షల వరకు వెల్లింది అంతా బానే ఉంది అంతలోనే ఇండియా గవర్నమెంటు బిట్ కాయిన్ లో జరిగే transactions కు తరువాత సంవత్సరం నుండి 30% tds కట్ అవుతుందని update చేసారు.... రాజు వెంటనే ఈ update బిట్ కాయిన్ కు ఖచ్చితంగా నెగిటివ్ అని పరిగణించి 30 లక్షల దగ్గర అమ్మేశాడు, అయితే రాజుతో ఎలాంటి communication లేని సోము అలానే ఉంచుకున్నాడు ..... చివరకు బిట్ కాయిన్ కు క్రాష్ వచ్చి సోము చాలా నష్టపోయాడు ఇదంతా కేవలం కల్పిత కధ అయినప్పటికీ గ్రుడ్డిగా పెట్టుబడులు పెట్టే దాదాపు అందరి పరిస్ధితి ఇంతే ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి