పేజీలు

16, ఏప్రిల్ 2023, ఆదివారం

నాకే ఎందుకు ఇన్ని సమస్యలు ఆధార్ కార్డు పుట్టిన తేదీ మార్చడానికి వెలితే ఇన్ని కష్టాలా BIG SCAM ఛేదించాను

 నేను మెదట ప్రైవేటు ఆధార్ కేంద్రానికి వెల్లాను అక్కడ ఇంతకు ముందు చాలా మంది జనం ఉండే వారు నా అడ్రస్ కూడా వాడే change  చేసాడు ఇంతకు ముందు అయితే ఇప్పుడు ఎవరూ లేరు అలానే చిన్న బ్యానర్ పెట్టుకున్నాడు కరక్షన్ ఉందా అంటే ఉంది అన్నాడు వెంటనే నా కార్డు నెంబరు కొట్టి చూస్తున్నాడు నేను ఇప్పుడు నా ఫింగర్ పెట్ట మంటాడు అనుకున్నాను కానీ otp చెప్పు అన్నాడు వెంటనే నా మెబైల్ open చేసి వచ్చిన ఆధార్ otp చెప్పాను వెంటనే నాకు ఏదో చూపించి నువ్వు ఇంతకు ముందే ఒకసారి కరక్షన్ చేసావు కాబట్టి నీకు కుదరదు అన్నాడు వెంటనే  ఒక దారి ఉంది నువ్వు ఇండియాలో ఎక్కడికెల్లినా అవ్వదు కాబట్టి కేవలం బేంగుళూరులో మాత్రమే అవుతుంది... అయితే 4950 రూపయలు ఇస్తే మా దగ్గర పని అవుతుందని చిన్నగా అసలు విషయం చెప్పాడు ఎక్కడో jio mart లో అంట ఆధార్ పాన్ ఒకే DOB లేదని వాల్లకు ఉద్యోగం రాలేదని  అన్నాడు ... అంటే 5 వేల కోసం జాబ్ వదులుకోవడం కరక్టు కాదు అని వెదవ సలహా వాడే ఇస్తున్నాడు......----- సశేషం

......................................................

ఆ తరువాత నాకు తెలిసిన ఒక స్నేహితుడికి విషయం చెప్పా తనకు తెలిసిన వారిని అడుగుతానని ఫోన్ చేసాడు ఇలా DOB కరక్షన్ కు 12000 అవుతుంది కానీ మీరు తెలిసిన వారు కాబట్టి 11 వేలకు చేయగలనని చెప్పాడు గోవిందా.....అయితే నా ప్రయాణం ఇక్కడ ఎందుకు ఆగుతుంది అసలే చాలా ఖాలీగా ఉన్నాను చూద్దాం ఏదో ఒక మార్గం దొరుకుతుందా అని.... సశేషం

.................................................

ఈ మద్యలో నేను twitter లో  aadhar వారికి tweet చేసి అడగటం మెదలు పెట్టాను how to chang dob అని వాల్లు ఎప్పటికో సమాధానం ఇచ్చారు మామూలుగానే చేసుకోండి ఏం సమస్య ఉండదు ....... అరె వీల్లేమో 10 వేలు లేదా 5 వేలు అడుగుతుంటే వాల్లు 50 రూపయలు ఇచ్చి మామూలుగానే చేసుకోండి అంటున్నారు ఏం అర్దం కాలేదు ---- సశేషం

https://twitter.com/Aadhaar_Care/status/1633711915959721985

................................................

 ఆ తరువాత నేను official list of aadhar centers in jangareddigudem ద్వారా మా ఇంటి పక్కనే ఉన్న bsnl office లో కూడా ఆధార్ సెంటర్ ఉందని గ్రహించాను మరియు పోస్టు ఆఫీస్ లో కూడా సెంటర్ ఉంది వెంటనే పోస్టు ఆఫీస్ కు వెల్లాను అక్కడ తీసేసాడని చెప్పారు తరువాత bsnl office కు వెల్లాను ......... అక్కడ తన తెలివితేటలు ప్రదర్సించాడు సేమ్ ప్రాసెస్ ఫింగర్ తో కాకుండా otp తో ఆధార్ కార్డు open చేసాడు సేమ్  సేమ్ సేమ్ అందరూ అంతేగా మనీ మనీ మనీ నీకు ఇండియాలో ఎక్కడా అవ్వదు హైదరాబాదుకు వెల్లాలి అన్నాడు అక్కడ బెంగులూరు ఇక్కడ హైదరాబాద్ ఎదవలకు sync లేదు పైగా నాకు ఒక సలహా ఇచ్చాడు నువ్వు హైదరాబాద్ వెలితే ఈజీగా అక్కడ  stay చేయడాని ఇతర ఖర్చులు కలిపి 5 వేలు అవతుంది అదేదో వాల్లు చెప్పినట్టు 5 వేలు ఇచ్చి చేయించుకున్నా సరిపోతుంది అన్నాడు పైగా నాకు తన ఫోన్ నెంబరు ఇచ్చి సాయంత్రం చేయమని చెప్పాడు ఖతం----చూడబోతే అందరూ కుమ్మకైనట్టు ఉంది పాన్ ఆధార్ లింకింగ్ డెడ్ లైన్ దగ్గరకు వస్తుంది------   ఇంక నాకెలానో అర్ధం కాలేదు ఇంక ఇంతకు మించి దారి లేదేమో అనుకున్నాను --------- సశేషం

-------------------------------------------





గత వారం విశేషాలు

గత నెలలో జరిగిన ముచ్చట్లు

గత సంవత్సర కాలంలో జరిగిన సంఘటనలు

జనాదరణ పొందిన పోస్ట్‌లు

ప్రకటనలు